దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష
యాదాద్రి థర్మల్ కేంద్రంలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడంపై అధికారులను ప్రశ్నించిన సీఎం, డిప్యూటీ సీఎం
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి జీ 9 బొగ్గు అవసరమని తెలిపిన అధికారులు
సింగరేణి లో జీ 9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ 9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని తెలిపిన అధికారులు
జీ 9 బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతతో ఎలా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించారని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పిట్ హెడ్ (బొగ్గు గనుల పైనే విద్యుత్ కేంద్ర నిర్మాణం) కాకుండా, దూరంగా ఎందుకు యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మించారని, దానికి బొగ్గు సరఫరాతో రాష్ట్రంపై పడే అదనపు భారం ఎంత అని అధికారులను ప్రశ్నించిన సీఎం, డిప్యూటీ సీఎం
నాడు రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్ పై కాకుండా దూరంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించారని తెలిపిన అధికారులు
యాదాద్రికి బొగ్గు సరఫరాతో తెలంగాణ రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపిన అధికారులు
సింగరేణి నుంచి జీ 9 బొగ్గు కు ఉన్న అవకాశాలపై ఆరా తీసిన సీఎం, డిప్యూటీ సీఎం
గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో జీ 9 బొగ్గును సింగరేణి సరఫరా చేయలేదని తేల్చిచెప్పిన అధికారులు
సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని తెలిపిన అధికారులు
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ అవసరాల దృష్ట్యా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
ఎత్తిపోతల పథకాల పంపులకు విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
అన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రస్తుత అవసరాలకు తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం
జెన్ కో కు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
వ్యవసాయ విద్యుత్ సరఫరాలోనూ ఆటంకాలు ఉండొద్దని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
సాగుకు కేవలం సోలార్ విద్యుత్ మాత్రమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం డిస్కంలకు సూచించిందని ముఖ్యమంత్రికి తెలియజేసిన అధికారులు
* హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్కో సీఎండీ డి. కృష్ణ భాస్కర్, టీజీఆర్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, జెన్కో సీఎండీ ఎస్. హరీష్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్సీసీఎల్ డైరెక్టర్ (పీడబ్ల్యూ&ఏ) పి.గౌతమ్ ,ఇతర ఉన్నతాధికారులు.








