పవన్, మహేష్, చరణ్ సినిమాలను దాటేసిన ప్యారడైజ్
నేచురల్ స్టార్ నాని(nani) నటించిన ది ప్యారడైజ్(the paradise) రిలీజ్‌కు కొన్ని గంటల ముందే బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతోంది. శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాపై మొదటి నుంచీ భారీ అంచనాలుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ ఆ హైప్‌ను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రీమియర్స్, డే1 కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా గ్రాస్ ప్రీ సేల్స్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో నాని కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్ దిశగా సినిమా దూసుకెళ్తోంది.
నార్త్ అమెరికాలోనూ ది ప్యారడైజ్ జోరు కొనసాగుతోంది. యూఎస్ ప్రీమియర్స్‌కు ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైగా ప్రీ సేల్స్ నమోదయ్యాయి. ఇది నాని సినిమాల్లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. మరోవైపు బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో కలిపి 9 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం ఆసక్తిని పెంచుతోంది. బుక్‌మైషోలో ఒక్క రోజుకి సంబంధించిన ప్రీ సేల్స్ 5.23 లక్షల టికెట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో హరిహర వీరమల్లు(harihara veeramallu), గుంటూరు కారం(guntur karam), పెద్ది(peddi) వంటి భారీ సినిమాలను అధిగమించడం విశేషం.
ఇక సినిమాను ఇప్పటికే చూసిన వారి నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా అంచనాలను మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లిందని నాని స్వయంగా చెప్పడం ఆసక్తిని పెంచింది. ఆయా షేర్(aaya sher), యషనాగుల(Yashanagula) సాంగ్స్ చార్ట్బస్టర్లుగా నిలవగా.. సమ్మక్క(Sammakka), అంజానా అంజానీ(Anjana anjani)కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ది ప్యారడైజ్ నాని కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా కొత్త రికార్డులకు బాట వేస్తున్నట్లు కనిపిస్తోంది.








