అవకాశమున్నా చివర్లో హడావిడి ఎందుకు?
త్రివిక్రమ్ శ్రీనివాస్(trivikram srinivas) నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. గుంటూరు కారం తర్వాత వెంకటేష్(venkatesh) తో ఆయన చేస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47(AK47)పై మొదటి నుంచీ ఆసక్తి ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రిలీజ్ ను వారం రోజులు వెనక్కి జరిపి అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ చేశారు. కానీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర బృందంలో పనుల ఒత్తిడి మాత్రం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‌కు పెద్దగా కొరత లేని పరిస్థితి. వెంకటేష్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా డేట్లు కేటాయించారు. అయినప్పటికీ గత వారం వరకు షూటింగ్ జరగడం, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేయాల్సి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో వెంకటేష్ తోనే అనిల్ రావిపూడి(anil ravipudi) మరో సినిమా మొదలుపెట్టి ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో త్రివిక్రమ్ సినిమాకు ఇంత టైమ్ దొరికినా ఆఖరి దశలో ఎందుకు ఇంత హడావుడి ఏర్పడిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆదర్శ కుటుంబం(adarsa kutumbam)ను మొదట ఈ ఇయర్ సమ్మర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌కు మార్చారు. ఇప్పుడు అక్టోబర్ 9 గడువును అందుకోవాల్సి ఉండటంతో టీమ్‌పై ప్రెజర్ మరింత పెరిగింది. ముఖ్యంగా తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్స్ ను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సైతం పెండింగ్ వర్క్స్ పై పూర్తిగా దృష్టి పెట్టినట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్. రాధాకృష్ణ(S radhakirshna) నిర్మిస్తున్నారు. మరి లాస్ట్ మినిట్ లో జరుగుతున్న ఈ పరుగులు అనుకున్న రిలీజ్‌కు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.








