జార్జి క్రిష్ లో శర్వనంద్ కు జోడీగా మానస
సంక్రాంతి బరిలోకి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రెడీ అవుతోంది. శర్వానంద్(sharwanand) హీరోగా శ్రీను వైట్ల(Srinu vaitla) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు జార్జ్ క్రిష్(George krish) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకర(Anil sunkara) నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనౌన్స్మెంట్ రోజే వరల్డ్‌వైడ్ డిస్ట్రిబ్యూటర్లను వెల్లడించడం ద్వారా చిత్ర బృందం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు సరిపోయే ఎంటర్టైనింగ్ కథతో శ్రీను వైట్ల మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారనే ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన మానస వారణాసి(manasa varanasi) హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటివరకు తాను కనిపించిన పాత్రలకు భిన్నమైన ప్రెజెంటేషన్‌తో మానసను స్క్రీన్‌పై చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శర్వానంద్‌తో ఆమెకు ఇదే తొలి కలయిక కావడంతో ఈ కొత్త జంటపై కూడా ఆసక్తి ఏర్పడుతోంది. ముఖ్యంగా మానస సంప్రదాయ లుక్ ఇప్పటికే ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. కథకు తగ్గట్టుగా ఆమె క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉండటంతో పాటు, శర్వానంద్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉంది.
మరోవైపు జార్జ్ కృష్ ప్రమోషన్లకు చిత్ర బృందం ముహూర్తం ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 24న తొలి బూస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో అసలు సినిమా ఎలా ఉండబోతోంది, శర్వానంద్ క్యారెక్టర్ ఏ తరహాలో సాగుతుంది, శ్రీను వైట్ల ఈసారి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ను అందించబోతున్నారు అనే ప్రశ్నలకు కొంతవరకు సమాధానం దొరికే అవకాశం ఉంది. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు మొదటి బూస్టర్‌తోనే ప్రమోషనల్ జోష్ మొదలుకానుంది.








