డూండి గణేష సేవాలో మంత్రి లోకేష్
విజయవాడ భవానీపురంలో ‘డూండి’ గణపతి నవరాత్రి ఉత్సవాలు
72 అడుగుల మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్
విజయవాడ: విజయవాడ భవానీపురంలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణహితంగా రూపొందించిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహా గణపతి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కమిటీ సభ్యులతో మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డూండి గణేష సేవా సమితి వ్యవస్థాపకులు డూండి రాకేష్, ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, డూండి గణేష సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.








