రాకాలో రష్మిక పాత్రపై ఇంట్రెస్టింగ్ టాక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా(raaka)పై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(rashmika mandanna) భాగం కానున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె క్యారెక్టర్ కు సంబంధించి వినిపిస్తున్న వివరాలు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ఇప్పటివరకు రష్మిక గ్లామర్‌తో పాటు యాక్టింగ్ కు ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించింది. కానీ రాకాలో మాత్రం ఆమెకు పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్‌ను అట్లీ(Atlee) డిజైన్ చేసినట్లు సమాచారం. కథలో కీలకమైన మలుపుకు కారణమయ్యే ఈ పాత్రకు కొన్ని నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. దీంతో అల్లు అర్జున్(Allu Arjun)తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకునే సీన్స్ పై ఆసక్తి ఏర్పడుతోంది.
అయితే రష్మిక క్యారెక్టర్ స్వరూపం, ఆమె క్యారెక్టర్ కథలో ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందనే విషయాలపై చిత్రబృందం అఫీషియల్ గా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశముందని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.








