సల్మాన్ షర్ట్ లెస్ సీన్.. బిగ్ బాస్ కు భారీ వ్యూస్
బిగ్ బాస్ 20(bigg boss20)లో సల్మాన్ ఖాన్(salman khan) చేసిన ఓ సర్ప్రైజింగ్ యాక్షన్ ఇప్పుడు షోకు కొత్త హైప్ తీసుకొచ్చింది. వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో తన లుక్‌పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌కు రెస్పాండ్ అవుతూ సల్మాన్ షర్ట్ విప్పి చూపించిన సీన్ వైరల్‌గా మారింది. ఈ ఒక్క ఘటనతో ఆ ఎపిసోడ్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
సల్మాన్ వయసు, బరువు, లుక్‌తో పాటు బట్టతలపై కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న కామెంట్లను ప్రస్తావించారు. ట్రోలర్ల కామెంట్స్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పే క్రమంలో టోపీ, జాకెట్, షర్ట్ తొలగించి తనను విమర్శించే వారికి ఛాలెంజ్ చేశారు. ఈ సీన్‌కు షోలోని కంటెస్టెంట్లు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఈ ఎపిసోడ్‌కు సుమారు 21 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు ఓ నివేదిక పేర్కొంది. అంతేకాదు, ఈ రెస్పాన్స్ తో బిగ్ బాస్ కు క్రికెట్ ప్రసారాలతో పోల్చదగిన వ్యూయర్షిప్ బెంచ్‌మార్క్‌లు నమోదైనట్లు కూడా సమాచారం. ఇప్పటికే జియోహాట్‌స్టార్‌లో బిగ్ బాస్ 20 ఓపెనింగ్ ఎపిసోడ్లు రికార్డు స్థాయిలో ప్రేక్షకాదరణ అందుకున్నట్లు ప్లాట్‌ఫామ్ అనౌన్స్ చేసింది.








