వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి : సీఎం చంద్రబాబు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆయా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్
టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు ఉండాలి.
• రిజర్వాయర్లు, నదులకు వచ్చే నీటిని అంచనా వేసుకుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి వరకూ సూచనలు జారీ చేయాలి.
• ఈ రాత్రికి వాయుగుండం తీరం దాటుతున్న నేపథ్యంలో రేపు వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. 24, 25వ తేదీల్లో జిల్లా కలెక్టర్లు అలెర్ట్‌గా ఉండాలి.
• శ్రీకాకుళం జిల్లాలో కొంతమేర వరి దెబ్బతిన్నాయి… ఎంతమేర దెబ్బతిన్నాయో అంచనా వేయండి.
• వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో రేపు కూడా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించండి.
• వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నీరు, ఆహారం, మెడిసిన్‌తో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి.
• జిల్లాల్లోకి వచ్చే ఇన్ ఫ్లోను అంచనా వేసుకుని జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలి.
• సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్సకారులను కూడా వెనక్కి వచ్చేలా చర్యలు చేపట్టింది.
• టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, ఏఎస్ఆర్, అనకాపల్లి, పశ్చిమ, గోదావరి, అంబేర్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు.
• జిల్లాల వారీ వర్షపాతం నమోదు, చేపట్టిన చర్యలపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
• ఈ రాత్రి ఒంటిగంటకు పోలాకి వద్ద వాయుగుండం తీరం దాటుతుందని వివరించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు.








