చరణ్- సుకుమార్ మూవీకి ముహూర్తం ఫిక్స్!
రంగస్థలం(rangasthalam) తర్వాత రామ్ చరణ్(ram charan)- సుకుమార్(sukumar) కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. RC17గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణానికి ముందు దశలో కీలక పనులను పూర్తి చేసుకుంటోంది. కథ, స్క్రీన్‌ప్లేకు సంబంధించిన వర్క్‌ను సుకుమార్ అండ్ టీమ్ ఇప్పటికే పూర్తి చేయగా, మిగిలిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 20న హైదరాబాద్‌లో ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసి, పూజా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు హీరోయిన్గా పలువురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అఫీషియల్ గా మాత్రం ఎవరినీ ఫిక్స్ చేయలేదు. రంగస్థలం తరహాలోనే భిన్నమైన కథనంతో ఈసారి మరింత స్టైలిష్ యాక్షన్ డ్రామాను రూపొందించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన నటీనటులు, టెక్నీషియన్ల ఎంపికపై ప్రస్తుతం దృష్టి పెట్టారు.
మరోవైపు పెద్ది(peddi) కోసం పూర్తిగా మార్చుకున్న లుక్ నుంచి బయటకు వచ్చేందుకు రామ్ చరణ్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నారు. RC17 షూటింగ్‌ను డిసెంబర్లో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. 2027 చివరి నాటికి షూటింగ్ ను పూర్తి చేయాలనే టార్గెట్ తో సుకుమార్ షెడ్యూల్స్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. దురంధర్(durandhar) ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్(Saswath sachdev) ఈ సినిమాకు సంగీతం అందించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 2028లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
\








