ఓవర్సీస్ లో నానికి మరో అరుదైన మైల్ స్టోన్
నేచురల్ స్టార్ నాని(nani) నటించిన ది ప్యారడైజ్(the paradise) రిలీజ్ కు ముందే ఓవర్సీస్ మార్కెట్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రీమియర్స్ కోసం 1.1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసింది. నాని నటించిన సినిమాల్లో ఇంత వేగంగా మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న సినిమాగా ది ప్యారడైజ్ నిలవడం విశేషం. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం సినిమాపై ఉన్న అంచనాలను స్పష్టం చేస్తోంది.
నార్త్ అమెరికా(North america)లో నానికి ఉన్న మార్కెట్‌ను ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మరోసారి బయటపెట్టాయి. దీంతో ఇప్పటివరకు ఈ ఏరియాలో మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసిన నాని సినిమాల సంఖ్య 12కు చేరింది. ముఖ్యంగా ది ప్యారడైజ్ లో నాని కనిపిస్తున్న రా అండ్ రస్టిక్ లుక్, పాత్ర స్వభావం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం కూడా ప్రీరిలీజ్ బజ్కు కలిసొచ్చింది.
ఇక సినిమా రిలీజ్ కు ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌పై ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్ మొదలైంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri) నిర్మించిన ఈ సినిమా గురువారం గ్రాండ్‌గా రిలీజ్ కానుండగా, కొన్ని ఏరియాల్లో ఈ రాత్రి నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. నాని కెరీర్లో ది ప్యారడైజ్ మరో కీలకమైన బాక్సాఫీస్ అధ్యాయంగా నిలుస్తుందా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.








