అద్దంకి దయాకర్‌కు అరుదైన అవకాశం … అమెరికా హార్వర్డ్ వర్సిటీలో
అమెరికా (America)లోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ( Harvard University) కెన్నెడీ స్కూల్లో అభ్యసించేందుకు తెలంగాణ ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు డాక్టర్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar)కు అవకాశం లభించింది. ప్రొఫెసర్ మార్షల్ గ్యాంజ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విభాగం, ఫ్యాకల్టీ ఆఫ్ పబ్లిక్ నేరేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించే లీడర్షిప్ (Leadership), స్టోరీ టెల్లింగ్ అండ్ యాక్షన్ అంశాలపై ఆయన అధ్యయనం చేయనున్నారు. ఈ నెల 31 నుంచి డిసెంబరు 18 వరకు నిర్వహించే ఈ కోర్సులో వివిధ దేశాల నాయకులు విభిన్న రంగాల్లో నాయకత్వ సవాళ్లను విశ్లేషిస్తారు అని అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.








