ఆయన అలా మాట్లాడటం సరికాదు : మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో సీఎం సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) కూడా అదే గౌరవం ఇస్తున్నామని చెప్పారు. రవీంద్రభారతి (Ravindra Bharati)లో నిర్వహించిన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన, ఆందోళన అర్థం చేసుకుంటాం. పార్టీకి సంబంధించి నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడకూడదు. రాజగోపాల్‌రెడ్డి ప్రజా నాయకుడు. నాకు మంచి మిత్రుడు. గీత దాటి మాట్లాడకూడదు. ఆయన ఆలా మాట్లాడటం సరికాదు. సమయం వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయి. ఏం మాట్లాడినా అధిష్ఠానం దృష్టికి వెళ్తుంది. బిల్లుల విషయంలో ఒక క్రమపద్ధతిలో ముందుకెళ్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా మేం చేయట్లేదు అని అన్నారు.








