విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇస్తున్నాం: సీఎం రేవంత్
మహాత్మ జ్యోతిబా ఫూలే, శ్రీమతి సావిత్రీ బాయి ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ సభ లో సీఎం గారి స్పీచ్ పాయింట్స్..
మహాత్మ జ్యోతి బా పూలే
డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ , మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను దేశంలో ఎక్కడకిపోయినా చూస్తుంటాం..
ఒక వైపు అంబేద్కర్ , మరో వైపు ఇందిరా గాంధీ, మరో వైపు పీవీ నరసింహారావు, మరో వైపు జ్యోతి బాఫూలే విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకున్నాం..
వారి స్పూర్తితో విద్యలో రాణించాలి..
నక్లెస్ రోడ్డు చౌరస్తా ఇప్పుడు అద్భుతమైన చౌరస్తా గా మారింది.
రాజ్యాంగాన్ని, ఓటు హక్కు ఇచ్చిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఆవిష్కరించబడింది..
150 యేళ్ల క్రితం జ్యోతి బా ఫూలే చదువు ఒక్కటే మార్గమని తను చదువుకోవడమే కాకుండా తన సతీమణిని చదివించడం ద్వారా ఆదర్శంగా నిలబడ్డారు..
150 యేళ్ల క్రితం చనిపోయినా ఈ తరం కూడా ఆదర్శ పురుషుడిగా చేస్తున్నామంటే వారి ఆలోచన గొప్పతనం..
మా ప్రభుత్వంలో జ్యతి బా ఫూలే ఆలోచనలను కొనసాగిస్తున్నాం..
చదవులు ఒక్కటే ఆత్మగౌరవాన్ని, గుర్తింపును ఇస్తుంది..
తలెత్తుకునేలా చేస్తుంది..
కుల నిర్మూలన జరగాలంటే, సామాజిక చైతన్యం కావాలంటే అందరు కలిసి కట్టుగా చదువుకోవడం, జీవించడం ద్వారా సాధ్యం అవుతుంది..
అందుకే ఇంటిగ్రేటేడ్ రెసిడ్ఎష యల్ స్కూల్స్ తీసుకువస్తున్ఆనం..
విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నాం..
నర్సీరీ నుంచి బ్రేక్ ఫాస్ట్ తో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం..
ఈ విద్యా సంవత్సరం నుంచి 2400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ ను అడ్బాన్స్ గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నాం..
పారదర్శకంగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తాం..
ప్రతియేడాది 2300 వేల కోట్ల రూపాయలను విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ వేస్తాం..
250 కోట్లు అడ్వాన్స్ గా పెట్టాం..
ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటే నెలలో ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యార్థుల ఖాతాల్లో పడుతుంది..
ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వమని ఏ కాలేజీ చెప్పకుండా ముందుగానే ఫీజులు చె్లిస్తాం..
ఇంజనీరింగ్ సర్టిఫికెట్ , డాక్టర్ సర్టిఫికెట్ లో ఉంటే ..
ఇప్పుడు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు..
నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు విద్య తో పాటు స్కిల్స్ నేర్పిస్తున్నాం.
స్కిల్స్ ఉంటే ఉపాధి లభిస్తుంది..
జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో 2 లక్సల తో ఉద్యోగాలు నర్సింగ్ సిద్ధంగా ఉన్నాయి..
సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవాలి..
ఐటీ నిపుణులు కూడా ఉద్యోగాలు పోయి వెనక్కి వస్తున్నారు..
2024 లో టాటా సంస్థతో కలిసి 119 నియోజకవర్గాల్లో ఏటీసీలను ఏర్పాటు చేశాం..
ఏటీసీల్లో చేరిన విద్యార్థులకు నెలకు 2000 రూపాయల స్టైఫండ్ ఇస్తున్నాం..
విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్నినేర్పుతున్నాం..
సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చే పరిస్థితిలేదు..
గ్రూప్ 1 నియామకాలు చేపడితే అందులో 6 0 శాతం మంది బీసీ లు ఉన్నారు..
ఇప్పుడు నూటికి నూరు మార్కులు వచ్చిన విద్యార్థులు 90 శాతం మంది ఉంటున్నారు..
విద్యతో పోటీ బాగా పెరిగింది..
పోటీ ప్రపంచంలో రాణించాం..
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేశాం..
క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తు్ననాం..
సిరాజ్, నిక్కజ్ , దీప్తి .. ఉద్యోగాలు
తల్లిదండ్రుల ఎలా బాధ్యతతో ఆలోచిస్తారో నేను కూడా అంతే బాధ్యతగా ఆలోచిస్తా..
క్రీడల్లో రాణించి పతకాలు తీసుకువస్తే నగదు నజరానాలతో పాటు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది..
చదువుకుంటేనే అవకాశాలు వస్తాయి.. అవకాశాలను అందిపుచ్చుకోవాలి..
సామాజిక చైతన్యంతో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది..
ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు దశాబ్దాలు కోట్లాడారు..
మీ రేవంతన్న దేశంలోనే మొదటి సారి ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యను పరిష్కరించాం..
బీసీ జనగణన చేయడానికి దేశంలో ఎవరూ ధైర్యం చేయలేదు..
బ్రిటిష్ వాళ్ల తర్వాత ఎవరూ బీసీ జనగణనన చేయలేదు..
కాని మేం బీసీ జనగణనన చేసి బీసీల లెక్క తేల్చాం..
యేడాదిలో బీసీ జనగణన ను పూర్తి చేశాం..
కులగణనలో భాగస్వామ్యం పంచుకోకుండా మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు పాల్గొనకుండా వ్యతిరేకించారు..
కులగణన చేసిన మొదటి రాష్ట్రం, చివరి రాష్ంట్రం మాదే..
బలహీన వర్గాలకు ఉద్యోగాలు కల్పించాలంటే వాళ్ల లెక్క ఉండాలి.. అందుకే కులగణన చేశాం..
ప్రతి సమస్యను పరిష్కరించుకుంటు వెళ్తున్నాం..
గత ప్రభుత్వం బర్రెలు ,గొర్రెలు పెంచుకోండి, చెప్పులు కుట్టుకోండి, చేపలు పట్టుకోమని చెప్పింది..
వాళ్ల పిల్లలు రాజ్యాలు ఏలాలన్నది వాళ్ల ఆలోచన..
బీసీలు రాజ్యాధికారంలో భాగం అడుగుతారన్న ఉద్దేశంతోనే గొర్రెలు, బర్రెలు పెంచుకోమని చెప్పారు..
ఇప్పుడు కూడా చెప్పులు కుట్టుకోవాల్సిందేనా.. ఇప్పుడు కూడా గొర్రెల, బర్రెలు కాసుకోవాల్సిందే..
ఈ సమాజం చదువుకోవద్దా.. ఐఎఎస్ లు,ఐపీఎస్ లు, మంత్రులు,ఎమ్మెల్యేలు కావొద్దా..
చదవు ఓక్కటే తలరాతలు మారుస్తుంది.. తెలంగాణ ను మారుస్తుంది..
చదువు ఒక్కటే పరిష్కారం..అదే మార్గం..
తెలంగాణను ప్రపంచ పఠంలో పెట్టడానికి చదువే మార్గం..
జ్యోతి బా ఫూలే స్పూర్తిని తీసుకుని విద్యార్థులు చట్టసభల్లోకి రావాలి.. డాక్టర్లు,ఇంజనీర్లు కావాలి..
నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది..
నాణ్యమైన విద్యను, పౌష్టికాహారాన్ని అందించే బాధ్యత నాది..
మీ బంగారు భవిష్యత్తు కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తా..
ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు.. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి..
హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు,వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్,కొండ సురేఖ,అజరుద్దీన్,విప్ ఆది శ్రీనివాస్,ప్రభుత్వ సలహాదారు లు వి హనుమంత రావు ,కె కేశవ రావు.ఎంపీ లు అనిల్ కుమార్ యాదవ్,ఆర్ కృష్ణయ్య,సురేష్ షెట్కర్,ఎంఎల్ ఏ లు దానం నాగేందర్,నవీన్ యాదవ్ ,మందుల సామేల్ ,మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, ప్రకాష్ గౌడ్,శ్రీ గణేష్,బీసీ సంఘాల నాయకులు,ఉన్నతాధికారులు.








