డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ : మంత్రి కొండపల్లి
డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. గ్రామాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు (DWCRA women) రూ.3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్రీనిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ పథంలో మహిళలు పండ్లు, కూరగాయాల(vegetables) ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు ( Pickles), పిండి పదార్థాలు, స్నాక్స్ (Snacks) వంటి ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను డిస్ట్రిక్ రిసోర్స్ ఆర్గనైజేషన్స్‌గా పరిగణించి వారి ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించడం జరుగుతుందన్నారు. మహిళలకు కేవలం రుణం ఇవ్వడమే కాకుండా, వారి వ్యాపారం విజయవంతం అయ్యే వరకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటుందన్నారు.








