ఆళ్ల రామకృష్ణారెడ్డి కి సుప్రీంకోర్టులో చుక్కెదురు
అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్ ఫూలింగ్ పై పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) దాఖలు చేసిన పిటిషన్ ( Petition)ను సీజేఐ ధర్మాసనం డిస్మస్ చేసింది. అసైన్మెంట్ భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత పూలింగ్ చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కొందరికి లబ్ది చేకూర్చేందుకు ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని వాదించారు. అయితే రాజకీయ కారణాలతో ఇలాంటి అంశాలు లేవనెత్తుతున్నారని సీజేఐ పేర్కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను గతంలోనే హైకోర్టు (High Court) క్వాష్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను డిస్మస్ చేసింది.








