దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.. కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న డేటా సెంటర్ల (Data centers)కు ఏడాదికి 3.50 టీఎంసీల నీరే సరిపోతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. వెలగపూడి సచివాలయంలో పోలవరం(Polavaram), వెలిగొండ (Veligonda) సహా 36 ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల నీటి అవసరాలపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లలో నిల్వలు, ప్రవాహాలను గమనిస్తూ జల నిర్వహణ చేపట్టాలి అని జలవనరులశాఖ అధికారులకు చంద్రబాబు ఉద్బోధించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివాలి. తరువాతే పారిశ్రామిక, సాగునీటి అవసరాలపై దృష్టిసారించాలి. రిజర్వాయర్లు (Reservoirs), చెరువుల్లోని నీటిని, భూగర్భజలాలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలి అని సూచించారు.








