AI లో యువతకు ఉచిత శిక్షణ : ప్రధాని మోదీ భారీ ప్రకటన
న్యూఢిల్లీ : 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీని కంటే ముందు మొదటి సారిగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలాపించారు. తర్వాత ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి, జనగణమనను ఆలాపించారు.
ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యువత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మోదీ ఓ భారీ ప్రకటన చేశారు. యేడాది వ్యవధిలోనే కోటి మంది యువతకు AI లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి తోడు విద్యార్థులు, యువత కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా నవతరాన్ని సన్నద్ధం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
వికసిత భారత్, ఆత్మ నిర్భర భారత్ గురించి నొక్కి చెప్పారు. గొప్ప విజయాలు సాధించడానికి గొప్ప కలలు కనండి.” భారతీయులు గొప్ప కలలు కనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం పిలుపునిచ్చారు. గొప్ప కలలు కన్నప్పుడు, అంతకంటే గొప్ప విజయాలను సాధించడానికి శక్తి వస్తుందన్నారు. మనం గొప్పగా కలలు కనాలి. మన సంకల్పం దృఢంగా ఉండాలి. కలలు, సంకల్పం గొప్పగా ఉన్నప్పుడు, మన లక్ష్యాలను సాధించడానికి మనం మరింత కృషి చేస్తాం” అని ప్రధాన మంత్రి అన్నారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, నేడు భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని కలలు కంటోందని, ‘వికసిత్ భారత్’ అనే మన కలను సాకారం చేసుకుంటామని ఘంటా పథంగా చెప్పారు. వికసిత భారత్ అన్న లక్ష్యాన్ని చేరుకోవాలని, 140 కోట్ల మంది కలిసి కట్టుగా దీనిని సాధించాలని సూచించారు. దీని ద్వారా ప్రపంచ దేశాలకు మన శక్తి, సత్తా ఏమిటో తెలిసి వస్తుందని, అప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తాయని అన్నారు. అలాగే భిన్నమైన కోణంలో భారత్ ను చూస్తాయన్నారు.
“గత 12 ఏళ్లలో దళితులు, అణగారిన వర్గాలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు లేదా యువత… ఇలా కోట్లాది మంది ప్రజలు ఒక సంకల్పాన్ని తీసుకున్నారని, అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వారి కృషిని తాను తప్పకుండా గౌరవిస్తానని, దీని ఫలితంగానే 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రకటించారు. ప్రతి భారతీయుడూ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి తమదైన రీతిలో ప్రయత్నిస్తున్నారు. ప్రతి భారతీయుడి కృషిని నేను గుర్తిస్తున్నానని ప్రకటించారు.
ప్రపంచం ఒక కొత్త, ధైర్యవంతమైన భారతదేశాన్నిచూస్తోందన్నారు. గొప్పగా కలలు కనడం మరియు గొప్ప విజయాలు సాధించడం కొత్త భారతదేశం యొక్క ప్రత్యేకత; మా ప్రయత్నాలను గుర్తించేలా ప్రపంచానికి ఓ ప్రత్యేక పరిస్థితి వచ్చిందన్నారు.








