విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘరో ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎసఎంఎస్-2, ఎస్టీసీ -3 హిట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కుద్రవం లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 1,500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కుద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం సంభవించడంతో భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు uయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మృతులను అప్పారావు (Apparao), ప్రభాకర్ రావు, కృష్ణ (Krishna), రమణ, త్రినాథ్ (Trinath,), అప్పలరాజు, కుమార్ గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో ఐదుగురు విశాఖ స్టీల్ ఉద్యోగులు కాగా, ముగ్గురు ఒప్పంద కార్మికులని అధికారులు తెలిపారు.








