Amaravati: దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్.. బిట్స్ పిలానీ ప్లాన్లను పరిశీలించిన లోకేశ్!
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విద్యా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు పడింది. అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న ‘బిట్స్ పిలానీ’ క్యాంపస్ నిర్మాణ ప్రణాళికలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు ఆయనను కలిసి క్యాంపస్ డిజైన్లు, కోర్సుల వివరాలను వెల్లడించారు.
కీలక కోర్సులు – భారీ పెట్టుబడులు:
ఈ క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ క్యాంపస్ అభివృద్ధి కోసం రూ.1000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు బిట్స్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. రెండు దశల్లో చేపట్టే ఈ నిర్మాణాల ద్వారా సుమారు 7వేల మంది విద్యార్థులకు విద్యావకాశాలు దక్కనున్నాయి.
పర్యావరణ హితంగా ‘నెక్స్ట్ జెన్’ క్యాంపస్:
దేశంలోనే మొట్టమొదటి ఏఐ (AI) కేంద్రిత క్యాంపస్‌గా ఇది నిలవబోతోంది. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ‘గ్రీన్ బిల్డింగ్’ , పునరుత్పాదక ఇంధన (Renewable Energy) విధానాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇక్కడ వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు కూడా ఉంటాయని ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి క్యాంపస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఇవి కూడా చదవండి








