Nara Lokesh: ఆ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవునిచెరువు ప్రభుత్వ పాఠశాలలో గత మూడు నెలలుగా నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని విద్యార్థులు (Students) ఆరోపించారు. భోజనం నాణ్యతగా లేదని విద్యార్థులు డస్ట్ బిన్ లో పారబోశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం వచ్చిందని, ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు లోకేశ్ తెలిపారు. ఈ కమిటీ సమగ్రంగా విచారణ జరిపి నివేదిక సమర్పించనుందని వివరించారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే కొన్ని ప్రాథమిక చర్యలు తీసుకున్నామని అన్నారు. భోజనం సరఫరా చేస్తున్న ఏజెన్సీ (Agency)ని మార్చడంతో పాటు పాఠశాల హెడ్ మాస్టర్ (Headmaster) పై కూడా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి








