AP: హెడ్ మాస్టర్ ఓవరాక్షన్ కు ఏపీ గవర్నమెంట్ ట్రీట్మెంట్..!
టీచర్లు పాఠాలు చెప్పాలి.. రాజకీయ నాయకులు రాజకీయం చేయాలి.. అలా కాకుండా టీచర్లు రాజకీయాల్లో వేలు పెడితే, పరిణామాలు ఎలా ఉంటాయో తాజాగా ఏపీ ప్రభుత్వం నిరూపించింది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవునిచెరువు ఎంపీపీ పాఠశాలలో ఓ హెడ్ మాస్టర్ గారు, పాఠాలు చెప్పడం మానేసి విధ్యార్ధులతో ఓ వీడియో చేయించారు. ఏపీ ప్రభుత్వం అందిస్తోన్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా, విద్యార్ధులకు అందిస్తోన్న భోజనం బాగా లేదని, విద్యార్ధులు తమ ఆహారాన్ని డస్ట్ బిన్ లలో పారబోసారు.
ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో(Social media) విస్తృతంగా వైరల్ అయింది. పాఠశాలలో విద్యార్ధులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉండటం, కోడిగుడ్లు కుళ్ళిపోయి దుర్వాసన రావడంతో తినలేకపోతున్నారని ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో అటు ఇటు తిరిగి విద్యాశాఖా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) దృష్టికి వెళ్ళింది. అటు తల్లి తండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే లోకేష్, త్రిసభ్య కమిటీ వేస్తూ నిర్ణయం తీసుకుని, విచారణ చేయించారు. హెడ్ మాస్టర్ కావాలనే విధ్యార్ధులతో అలా చేయించారని గుర్తించారు.
ఇవి కూడా చదవండి

గత మూడు నెలలుగా ఆహారం సరిగా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా, పర్యవేక్షణలో విఫలమయ్యారని, ఈ ఘటన వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనుమానించిన ప్రభుత్వం, త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా స్కూల్ హెడ్ మాస్టర్ ను వెంటనే సస్పెండ్ చేసారు. ఇక ఏజెన్సీని కూడా మారుస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. అలాగే అసౌకర్యానికి గురైన విద్యార్ధులకు, వారి తల్లి తండ్రులకు లోకేష్ క్షమాపణ కూడా చెప్పారు. ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు లోకేష్. విద్యార్థులకు ఉత్తమ సంరక్షణ, నాణ్యమైన సేవలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








