మహిళా రిజర్వేషన్ , డీలిమిటేషన్ బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు : ఎంపీ లావు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తోందని ఆ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Sri Krishnadevaraya) తెలిపారు. లోక్సభ (Lok Sabha)లో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్ (Delimitation) బిల్లుకు కూడా టీడీపీ మద్దతిస్తోందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. చట్టసభల్లో మహిళల గొంతుక పూర్తిస్థాయిలో వినిపించే అవకాశం వచ్చింది. దేశంలో 50 శాతం ఉన్న మహిళల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్లపై ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ (Modi) నేతత్వంలో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి అని అన్నారు.
ఇవి కూడా చదవండి








