Ganta Srinivasa Rao: ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి : గంటా శ్రీనివాసరావు
భవిష్యత్ తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) విమర్శించారు. ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) పై మాజీ మంత్రులు అంబటి రాంబాబు (Ambati Rambabu) అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖలో గంటా శ్రీనిసరావు మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్, రోజా చేసిన మురికి వ్యాఖ్యల మీడియాలను ఆయన ప్రదర్శించారు. నాలుగుసారు సీఎంగా ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల్లో ఆగ్రహం ఉంటుందని అన్నారు. వైసీపీ హయాంలో ఆయన్ను విశాఖ ఎయిర్పోర్ట్లో ఘోరంగా అడ్డుకున్నారని చెప్పారు. ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని, పైగా కులాలను ఆపాదిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అసెంబ్లీలో వైఎస్ఆర్ (YSR) సైతం క్షమాపణ చెప్పిన ఘటనలు చూశామన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






