వెలిగొండతో ప్రజల కల సాకారం : లోకేశ్
వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) ద్వారా 30 ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ప్రజల కల సాకారమవుతోందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. కృష్ణా (Krishna) జలాలు వెలిగొండ నుంచి ప్రవహించడం భావోద్వేగం కలిగిస్తోందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల క్రితం సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నేడు ఆయనే ప్రజలకు అంకితం చేశారు. మొదటి దశలోనే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది అని తెలిపారు.








