వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
మార్కాపురం జిల్లా (Markapuram district) ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు ( Veligonda irrigation project) తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ (project pylon)ను ఆవిష్కరించారు. స్థానిక రైతులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని సీఎం విడుదల చేశారు.








