Minister Lokesh: ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), కూటమి ఎంపీల బృందం భేటీ అయింది. లోక్‌సభలో అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో లోకేశ్‌తో పాటు ఎంపీలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీని శాలువాతో లోకేశ్ సత్కరించారు. ఈ సందర్భంగా కంగ్రాంట్స్ అంటూ ఆయన్ను ప్రధాని అభినందించారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్ల (Om Birla)ను కూడా లోకేశ్, ఎంపీలు కలిశారు. సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








