Andhra Pradesh: యువతకు లక్ష ఉద్యోగాలే మా లక్ష్యం : నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర విద్యుత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మెగా ప్రాజెక్టు అనకాపల్లి ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి లోకేష్ ప్రసంగం:
పెట్టుబడిదారుల నమ్మకం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే అంతర్జాతీయ సంస్థలు ఏపీకి వస్తున్నాయని లోకేష్ తెలిపారు. కేవలం ఒక ‘జూమ్ కాల్’ ద్వారా ఇంతటి భారీ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగామని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి

భారీ ఉపాధి అవకాశాలు: ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. తన పాదయాత్రలో యువత సంక్షేమ పథకాల కంటే ఉపాధి అవకాశాలనే ఎక్కువగా కోరుకున్నారని, వారి కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి: ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. 2019లోనే ఆదిత్య మిత్తల్‌ను పెట్టుబడుల కోసం కోరామని, 2024లో అధికారం చేపట్టిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించామని వివరించారు.
త్వరితగతిన అనుమతులు: ఈ ప్రాజెక్టుకు వేగంగా అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి కుమారస్వామికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








