డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యం : మంత్రి కొల్లు
డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ప్రగతి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజా ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ (Modi)నాయకత్వంలో దేశ ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. దేశానికి మోదీ విజన్, రాష్ట్రానికి చంద్రబాబు (Chandrababu)విజన్ సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న ఎన్డీఏ (NDA) నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








