Minister Anam : టెండర్లన్నీ మార్చి నిబంధనలను తుంగలో తొక్కారు : మంత్రి ఆనం
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని నివేదికలన్నీ చెబుతున్నా, వైసీపీ సభ్యులు దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ( Anam Ramanarayana Reddy) అన్నారు. ఏపీ శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూపై స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితి తలెత్తడంతో మండలి చైర్మన్ మోషేను రాజు సభను వాయిదా వేశారు. జగన్ (Jagan) నాయకత్వంలో నివేదికలను తొక్కిపెట్టిన విషయం అందరికీ తెలుసు. టెండర్లన్నీ మార్చి నిబంధనలను తుంగలో తొక్కారు. తమకు అనుకూలంగా నిబంధనలను మార్చుకున్నారు. కల్తీ జరగడం వాస్తవమేనని వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy), కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) ఒప్పుకొన్నారు కదా. ఆనాటి టీడీడీ చైర్మన్లే ఒప్పుకొన్నప్పటికీ, వైసీపీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
ఇవి కూడా చదవండి








