Amaravati: అమరావతి బిల్లుకు కేంద్రం ఆమోదం..!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నూతన రాజధాని అమరావతి చరిత్రలో కీలక అడుగు పడింది. అమరావతి భవిష్యత్తును సుస్థిరం చేసే దిశగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సిన చారిత్రక అడుగు సఫలమైంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026’కు లోక్సభ(Loksabha) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న రాజధాని అనిశ్చితికి తెరదించుతూ, అమరావతికి రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించేలా ఈ సవరణలు చేయడం గమనార్హం. విభజన హామీల అమలుకు మరియు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ బిల్లు ఒక దిక్సూచిగా మారనుంది.
ఈ బిల్లుపై జరిగిన చర్చలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తో పాటు వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని స్థిరత్వం ఎంతో అవసరమని అన్ని పక్షాలు అభిప్రాయపడ్డాయి. అయితే, రాష్ట్రానికి చెందిన ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మినహా, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు జై కొట్టడం విశేషం. దీని ద్వారా అమరావతి విషయంలో ఉన్న అన్ని న్యాయపరమైన మరియు రాజకీయ చిక్కుముడులు వీడిపోయినట్లయింది.
లోక్సభలో పచ్చజెండా ఊపించుకున్న ఈ బిల్లు, రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో కూడా బిల్లు సులువుగా ఆమోదం పొందుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రస్థానానికి తిరుగులేని చట్టబద్ధత లభించడమే కాకుండా, కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల కేటాయింపునకు మార్గం సుగమమవుతుంది. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి








