MP Purandeswari: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి : ఎంపీ పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ కు అమరావతి (Amaravati) శాశ్వత రాజధానిగా ఉంటుందని బీజేపీ ఎంపీ పురందేశ్వరి (MP Purandeswari) అన్నారు. లోక్ సభ లో అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజభన ప్రక్రియ అరాచకంగా జరిగింది. ఆనాడు చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారు. పార్లమెంట్లో లైట్లు, కెమెరాలు ఆపి బిల్లు పాస్ చేశారు. చట్టాన్ని గౌరవించి విభజనను ప్రజలు అంగీకరించారు. ఆ తర్వాత ఏపీకి రాజధాని అవసరం వచ్చింది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పాలన ప్రారంభమైంది. విభజన ఆగ్రహం నుంచి రాజధాని అమరావతి పుట్టింది. రాజధానికి 29వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి భవితవ్యం అంధకారంలో పడింది. త్యాగం చేసిన రైతుల పట్ల గత ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








