Daggubati Purandeswari: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన దగ్గుబాటి దంపతులు
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao), ఆయన సతీమణి, ఎంపీ పురందేశ్వరి (Purandeswari) ప్రధాని మోదీ (Narendra Modi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారత్‌పై తక్కువగా ఉండేలా తీసుకున్న చర్యలపై వారు ప్రధానితో మాట్లాడారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాసిన ద గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తకాన్ని ప్రధానికి బహూకరించారు. దాన్ని పరిశీలించిన ప్రధాని ప్రపంచ చరిత్రపై ఇంత విపులంగా పుస్తకం రాయడానికి చేసిన కషిని అభినందించారు. దంపతులు ఇద్దరికీ వివిధ సందర్భాల్లో ఐరాస సాధారణ సభల్లో ప్రసంగించే అవకాశం రావడం అరుదైన గౌరవమని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








