ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు.. రూ.8,175 కోట్లతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. విద్యుత్ నిల్వ కోసం ఏర్పాటు చేసే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బెస్)లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీ (Lithium-ion battery)ల తయారీ పరిశ్రమలను వారీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనకాపల్లి జిల్లా (Anakapalli District) రాంబిల్లిలో రూ.8,175 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ 16 గిగావాట్ అవర్ లిథియం అయాన్ సెల్ ప్యాక్టరీ (Cell Factory) ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ యూనిట్లో సెల్, ప్యాక్, స్టోరేజ్‌కు అవసరమైన బ్యాటరీలను తయారుచేస్తారు. ఇది ఒకేచోట సెల్, ప్యాక్ తయారీ, ఎనర్జీ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసే మొట్టమొదటి సంస్థ కానుండటం గమనార్హం. ప్రాజెక్టు మొదటి దశ 2027 జులై నాటికి పూర్తి చేసి, వాణిజ్య ఉత్పత్తిలోకి తేవాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ పరిశ్రమకు సుమారు 300 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
ఇవి కూడా చదవండి








