Lakshmi Mittal: ప్రతి రంగంలో దీని అవసరం చాలా ఉంది : లక్ష్మీ మిత్తల్
ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఆర్సెలాల్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ (Lakshmi Mittal)అన్నారు. దేశానికి తిరిగి ఇచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) రాజయ్యపేటలో ఆర్సెలాల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ సాధనకు స్టీల్ (Steel Plant) చాలా ముఖ్యమైనదని చెప్పారు. ప్రతి రంగంలో దీని అవసరం చాలా ఉందని చెప్పారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన ప్రజలకు సీఈవో ఆదిత్య మిత్తల్ (Aditya Mittal) ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








