రోశయ్యకు విశిష్ట పురస్కారం
అందరివాడుగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో రోశయ్యకు నన్నపనేని వెంకట్రావు విశిష్ట పురస్కారాన్ని కోడెల శివప్రసాదరావు ప్రదానం చేశారు. ఎన్.వి.ఆర్ ట్రస్టు ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 16 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అపర చాణుక్యులుగా రోశయ్య గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రవేసిన రోశయ్యకు వెంకట్రావు పురస్కారం ఇవ్వడం సముచితమని మంత్రి ఆనందబాబు అన్నారు. స్నేహానికి విలువనిచ్చే వెంకట్రావు పురస్కారం అందుకోవడం మరచిపోలేనిదని రోశయ్య అన్నారు. సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, నన్నపనేని సుధాకర్ అన్నారు.













