ఏపీ పోలీస్ రిట్రీట్ 2026-ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
భవిష్యత్తులో పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు.. వాటిని ఏ విధంగా అధిగమించాలనే అంశాలపై రెండు రోజుల నుంచి పోలీస్ ఉన్నతాధికారుల మేథో మధనం.
మూడు రోజుల పాటు జరిగిన ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్సులో పాల్గొన్న రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు.
టెక్నాలజీని వినియోగించి పోలీసింగ్ ఏ విధంగా చేపట్టాలి… మహిళలపై నేరాలను అదుపు చేయడం… సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కాన్ఫరెన్సులో చర్చ.
వివిధ అంశాలపై తాము రూపొందించిన ప్రజెంటేషన్లను సీఎం చంద్రబాబుకు వివరించిన ఐపీఎస్ అధికారులు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• 2001లో ఇదే తరహాలో ఫ్యూచర్ పోలీసింగ్ తరహాలో వర్క్ షాప్ నిర్వహించాం.
• గతంతో పోల్చుకుంటే నేరాల తీరు మారింది.
• సోషల్ మీడియా వేదికగా సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారు.
• నేరాలను కట్టడి చేయడంతోపాటు.. తప్పులు చేసిన వారికి శిక్షలు పడేలా చేయగలిగితే నేరాలు అదుపులోకి వస్తాయి.
• మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థను రీ-స్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఏ మేరకు ఉందో పరిశీలించాలి.
• ఇన్విజిబుల్ పోలీస్… విజిబుల్ పోలీసింగ్ తరహా విధానానికి ప్రయార్టీ ఇవ్వాలి.
• టెక్నాలజీని వినియోగించడం ద్వారా చాలా తక్కువ మందితో ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ చేశారు.
ఇవి కూడా చదవండి
• శాంతి భద్రతలను అదుపు చేయడం… నేరాలను కట్టడి చేయడంలో ప్రణాళికలు రచించడంతో పాటు ఫలితాలు చూపగలగాలి.
• పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి… నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
• తిరుమల మెట్ల దారిలో అపహరణకు గురైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని టెక్నాలజీ వల్ల చాలా తక్కువ సమయంలో ట్రేస్ చేయగలిగారు.
• అపహరించిన వ్యక్తి మానసిక వికలాంగుడు కావచ్చు… కానీ సరైన చర్యలు తీసుకోకుంటే ప్రజలు అపోహపడతారు.
• ఇలాంటి సంఘటనల్లో సరైన చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు ఉంటుంది.
• ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొన్ని పార్టీలు ఏకంగా నేరాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
• పాస్టర్ ప్రవీణ్ ఘటనలో చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి నాలుగైదు రోజులు పట్టింది.
• గంజాయిని చాలా వరకు కంట్రోల్ చేశాం… కానీ ఇంకా కట్టడ చేయాలి.
• గంజాయి వల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశననమవుతున్నాయి.
• గంజాయి మత్తులో జరిగే నేరాలను కట్టడి చేయాలి.
• డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
• డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ విభాగాలను మరింత బలోపేతం చేయాలి.
• రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశాం.
• పోలీసుల్లో, ప్రజల్లో నైతిక స్థైర్యాన్ని పెంపోందించేందుకు స్వయంగా నేనే స్పాట్ కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
• పోలీస్ వర్క్ ఫోర్స్ ను రీ-ఓరియేంటేషన్ చేయాలి.
• పోలీసులకు డిజిటల్ లిటరసీ అనేది ఉండి తీరాల్సిన రోజులివి.
• పోలీసింగ్ లో ఏఐను అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
• అవసరమైన మేరకు పోలీసులకు సర్టిఫికేషన్ కోర్సులు ప్రవేశపెట్టాలి.
• వివిధ రకాల నేరాలను కట్టడి చేసే విషయంలో నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇవ్వాలి.
• ముఖ్యంగా సోషల్ మీడియా, సైబర్ నేరాలు, గంజాయి-డ్రగ్స్, మహిళలపై నేరాల కట్టడి, నేరాలకు శిక్ష పడేలా తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
• ఏపీఎస్పీ ద్వారా శిక్షణ పొందుతున్న వారిని డిప్యూటేషన్ మీద జిల్లాలకు పంపే అంశాన్ని పరిశీలించాలి.
• పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆయా రంగాల్లోని ప్రోఫెసర్లు, నిపుణులతో మాట్లాడుతూ ఉండాలి.
• టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో కొత్త విధానాలను తెలుసుకోవాలి.
• నేరాలను కట్టడి చేస్తూనే… నేరాలు చేయడానికి అలవాటు పడ్డ వారిని కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
• హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ హోదాల్లో ఉన్న వారి సేవలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.









