Minister Anam: ఏప్రిల్ 15 నుంచి నిషేధం : మంత్రి ఆనం
ఆంధ్రా ప్రాంత మత్స్యకారుల రక్షణకు ఎంతటి వరకైనా వెళ్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరి (Puducherry) మత్స్యకారుల దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏపీ మత్స్యకారులకు సంపూర్ణంగా అండగా ఉంటామన్నారు. మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మాస్టర్ ప్లాన్ (Master Plan) రూపొందిస్తున్నామన్నారు. మత్స్యకారుల సమస్యపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. హైపవర్ బోట్లతో మన సంపదను పొరుగురాష్ట్రాల మత్స్యకారులు దోచుకుంటున్నారు. సముద్ర జలాలపై గస్తీ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశాం. ఏప్రిల్ 14 వరకు సముద్ర జలాల్లో గస్తీ ఉంటుంది. ఏప్రిల్ 15 తర్వాత రెండు నెలల పాటు వేట నిషేధం అమల్లో ఉంటుంది. సీఎం ఆదేశాలతో రేపు ప్రత్యేక బందం నెల్లూరు జిల్లాకు వస్తోంది అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








