ధీరజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు : సీఎం చంద్రబాబు
ఆర్చరీ ప్రపంచకప్ ( Archery World Cup) ఫైనల్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్ బొమ్మదేవర (Dhiraj Bommadevara) చరిత్ర సృష్టించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కొనియాడారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్స్ నుంచి మెక్సికో (Mexico)లోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ అద్భుత ప్రస్థానం సాగిందని అభినందించారు. పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్న ధీరజ్, రాష్ట్రంలోని యువ ప్రతిభకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ధీరజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.








