RDT: అనంతపురం వాసులకు కేంద్రం శుభవార్త
అనంతపురం (Anantapur) జిల్లా వాసులకు కేంద్రం శుభవార్త చెప్పింది. విదేశీ నిధులు పొందేందుకు రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) కు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చింది. ఆర్డీటీ (RDT)సంస్థ అనంతపురం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి విదేశాలనుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన అనుమతులను ఎఫ్ సీ ఆర్ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) కింద నిలిపివేస్తూ ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆ సంస్థ ఎఫ్ సీ (ఫారిన్ కాంట్రిబ్యూషన్) ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడానికి ఆటంకం ఏర్పడింది. ఫలితంగా ఈ సంస్థ చేపడుతున్న విద్య, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాల అమలుకు అంతరాయం కలిగింది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మంత్రులు, ఎంపీలు దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఎఫ్ సీఆర్ఏ (FCRA) ను కేంద్రం రెన్యువల్ చేసింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








