తగ్గిన పీఎఫ్ వడ్డీ రేటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గాను ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించింది ఈపీఎఫ్వో. దాదాపు 6 కోట్ల ఖాతాదారులను నిరాశపరుస్తూ ఏడేండ్ల కనిష్ఠ స్థాయిలో 8.50 శాతానికి పరిమితం చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇది 8.65 శాతంగా ఉన్నది. బోర్డు సమావేశ నిర్ణయంతో రూ.700 కోట్లకుపైగా మిగులు ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.








