మోడీపై ప్రశంసలు..భారత్ పై ట్రంప్ విమర్శలు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి తనదైన రీతిలో భారత్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికాపై అధికసుంకాలు విదించి .. ఏళ్లతరబడి భారత్ లబ్ది పొందిందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడే కానీ..భారత్ తీరు మాత్రం సరిగా లేదన్నారు. వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ (Donald Trump) మాట్లాడారు.
భారత్- అమెరికా మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోడీ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన గొప్ప స్నేహితుడని ట్రంప్ అన్నారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.
అయితే..భారతదేశ సుంకాల విధానంపై ఆయన విమర్శలు చేశారు. ‘ఏళ్లతరబడి.. అమెరికా (USA) నుంచి భారత్ చాలా లబ్ధి పొందింది. మాపై వారు భారీగా సుంకాలు విధించారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భారత్ (India) నుంచి మేం భారీగా లాభాలు పొందుతున్నాం’ అని వ్యాఖ్యానించారు ట్రంప్…
భారత్- అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం (India-USA trade deal) కుదురుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య నాలుగు రోజుల పాటు సాగిన చర్చలు ముగిశాయి. ఈ క్రమంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.








