లెబనాన్ లో సీజ్ ఫైర్.. పది రోజుల పాటు ప్రశాంతత..
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య పదిరోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అంతేకాదు.. ఈ కాల్పుల విరమణ ఘనత తనదే అని సగర్వంగా ప్రకటించుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump).తాను రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపిన పదో యుద్ధం ఇదేనని ఆయన పేర్కొన్నారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుల(BB)తో తాను ‘అద్భుతమైన’ సంభాషణలు జరిపినట్లు తెలిపిన డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రారంభమైందన్నారు.
ఇవి కూడా చదవండి
‘‘అత్యంత గౌరవనీయులైన లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహులతో సంభాషణ అద్భుతంగా సాగింది… ఇరువురు నేతలూ తమ రెండు దేశాల మధ్య శాంతిని సాధించడానికి అంగీకరించారు.. అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ‘‘ప్రపంచవ్యాప్తంగా 9 యుద్ధాలను పరిష్కరించడం నాకు దక్కిన గౌరవం.. ఇది 10వది కాబట్టి, దీన్ని పూర్తి చేద్దాం!’’ అని అన్నారు.
వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్, లెబనాన్లు 34 ఏళ్లలో తొలిసారిగా సమావేశమయ్యాయని ట్రంప్ అన్నారు. ఆ రెండు దేశాలు శాశ్వత శాంతిని సాధించేలా చూడాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డాన్ కెయిన్లను తాను ఆదేశించినట్లు ట్రూత్ సోషల్‌లో తన పోస్ట్‌లో తెలిపారు. గతవారం ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఈ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని, ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ డిమాండ్ చేసింది. మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ సైతం కాల్పుల విరమణ ఒప్పందంపై చేసిన ప్రకటనలో లెబనాన్ ప్రస్తావన చేసింది.
ఇరాన్, అమెరికాల మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో లెబనాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని ఇరాన్ వాదించింది. ఇజ్రాయెల్ చేస్తోన్న దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి







