నేడే ఎన్డీయే పక్షాల కీలక భేటీ.. హాజరుకానున్న 75 మంది నేతలు
ఎన్డీయే ప్రభుత్వం వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక భేటీ జరగనుంది. ఇండియా కూటమి భేటీ జరిగిన రెండు రోజులకే ఎన్డీయే కూటమి భేటీ కూడా జరుగుతుండటం గమనార్హం. ఎన్డీయే కూటమి ఈ భేటీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. అయితే.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ అధ్యక్షత వహించనున్నారు.
ఈ సమావేశంలో 35 ఎన్డీయే పక్షాల నుంచి మొత్తం 75 మంది నేతలు పాల్గొంటున్నారు.ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా.. ఎన్డీయే సర్కార్ ఇప్పటి వరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చతో పాటు.. భవిష్యత్ కార్యాచరణపై కూడా ఇందులో విస్తృతంగా చర్చిస్తారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 72 మంది కూటమి నాయకులు హాజరయ్యే సమావేశంలో మోదీని గౌరవిస్తూ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నాయకులు ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. అలాగే, ప్రధానమంత్రి నాయకత్వం మరియు పాలనాపరమైన పనితీరును గుర్తిస్తూ ఆయనను సత్కరించనున్నారు.
“140 కోట్ల మంది తోటి పౌరుల ఆశీస్సులు మరియు ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో, మన యువత, మహిళలు మరియు రైతు సోదరసోదరీమణులను సాధికారులుగా తీర్చిదిద్దడంలో మేము ఎటువంటి ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు, ప్రపంచ వేదికపై భారతదేశం ఒక కొత్త గుర్తింపును పొందింది,” అని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు.
ఇక.. ప్రధాని మోదీని అభినందిస్తూ, ఎన్డీయేకు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశంలో తీర్మానం కూడా చేయనున్నారు. దీనిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. దీనిని నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో బలపరుస్తారు. దీనిపై పలువురు ఎన్డీయే నేతలు మాట్లాడతారు. తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.








