ఓ ఇంటివాడైన కశ్మీర్ సీఎం… నిధి రజ్ దాన్ తో ఒమర్ కొత్త జీవితం…
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(OMAR ABDULLAH)… ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నారు. నిధితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘‘కొత్త ప్రయాణం ప్రారంభమైంది’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో నిధిని ట్యాగ్ చేశారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకున్న మూడు నెలలకే ఈ వివాహం జరిగింది. ఆయనకు, విడిపోయి ఉంటున్న భార్య పాయల్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేసేందుకు జులై 31న సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంతో పాటు, ఒకరిపై మరొకరు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద విడాకులు మంజూరు చేయాలని ఉమ్మడిగా కోరారు.
ఇవి కూడా చదవండి
ఒమర్ అబ్దుల్లా, పాయల్ 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2009 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. 2011లో ఒమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.







