అధికారులు అప్రమత్తంగా ఉండాలి : డిప్యూటీ సీఎం ఆదేశం
మురుసు తుపాను (Cyclone murasu) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమీక్షించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం (Prakasam), బాపట్ల (Bapatla), కృష్ణా ( Krishna) జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని పవన్ అన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వాగులు, వంకల సమీపంలో జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు (Drinking water), విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సమన్వయం చేసుకోవాలని పవన్ దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ప్రజలకు సూచించారు.







