బెంగాల్ బరిలో దీదీకి షాక్.. భవానీపూర్‌లో సీన్ రివర్స్!
Assembly Election: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం అత్యంత వేగంగా జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగియడంతో, ఈవీఎం ట్రెండ్స్ వెలువడుతున్నాయి. దీనితో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై స్పష్టత వస్తోంది.
పశ్చిమ బెంగాల్..
ఇక్కడ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోంది. అత్యంత కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ స్థానంలో వెనుకంజలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
తమిళనాడు..
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. పెరంబూరులో విజయ్ ఆధిక్యంలో ఉండగా, తిరుచ్చి ఈస్ట్‌లో మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఇక డీఎంకే నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
ఇతరులు..
మైలాపూర్‌లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెనుకంజలో ఉండగా, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి తన నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఫలితాలు క్షణక్షణం మారుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.








