నేడు కేంద్ర కేబినెట్ ‘‘అత్యవసర భేటీ’’.. ఏ నిర్ణయాలు వస్తాయి?
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు (శనివారం) కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది. పార్లమెంటులో కీలక బిల్లులు వీగిపోయిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు, ఆర్థిక వ్యవస్థ ఇత్యాది పరరిణామాలపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారంజ
నిజానికి అత్యవసర భేటీ అని కేబినెట్ మంత్రులకు సమాచారం అందించారు కానీ, ఏ అంశాలపై అనేది ఇదమిత్థంగా చెప్పలేదు. అయితే పార్లమెంటులో బిల్లు వీగిపోయిన తర్వాత, ఈ వార్త రావడంతో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరుగుతుంది.అందులో ఆయా శాఖల పనితీరు, మరింత చేయాల్సిన పనులతో పాటు మరిన్ని విషయాలను చర్చిస్తారు. కానీ.. ఈ సారి కేబినెట్ భేటీకి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశాలు ఉన్నాయి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలపై ఆర్డినెన్స్ తేవడం వంటివి వుంటుందని ఊహాగానాలు మాత్రం వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు వంటి పలు కీలక నిర్ణయాలను మోదీ సర్కారు ఈ అత్యవసర కేబినెట్ భేటీలలోనే తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది..








