అసోంలో తిరిగి బీజేపీయే… రెండో స్థానంలో కాంగ్రెస్
అసోంలో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీయే తిరిగి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటుందని తెలిపారు. 88 సీట్ల నుంచి 100 సీట్ల వరకూ బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపాయి. కాంగ్రెస్ ఈ సారి కూడా ప్రతిపక్షానికి పరిమితం కావాల్సిందేనని తేల్చి చెప్పేశాయి. అసోంలో మొత్తం 124 సీట్లు వుండగా, మేజిక్ ఫిగర్స్ 64 సీట్లు అవసరం.
యాక్సెస్ మై ఇండియా
బీజేపీ – 88-100 సీట్లు
కాంగ్రెస్ – 24 – 36 సీట్లు
మ్యాట్రిస్ ఎగ్జిట్ పోల్స్
బీజేపీ 85-95 సీట్లు
కాంగ్రెస్ – 25 నుంచి 32 సీట్లు
అసోంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా తీవ్రంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా అసోం అభివృద్ధితో పాటు అక్రమ వలసదారుల అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ఇదే ప్రధాన అంశగా పరిణమించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇక.. కాంగ్రెస్ కూడా ప్రచారం చేసింది. కాంగ్రెస్ అగ్రనేత గొగోయ్ ను తెరపైకి తెచ్చి ప్రచారం చేయించారు. అలాగే చాలా ఆలస్యంగా రాహుల్ గాంధీ ప్రచారానికి వచ్చారు. అయితే.. హిమంత బిస్వ శర్మ భార్య దగ్గర పలు దేశాల పాస్ పోర్టులున్నాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. దీంతో దుమ్ము దుమారం రేగింది. అయితే.. డాక్యుమెంట్లను మాత్రం నకిలీ చూపించారు. దీంతో వివాదాల్లో చిక్కుకున్నారు.
ఇవి కూడా చదవండి







