తమిళనాడు, బెంగాల్ లో ‘‘డ్రైడే’’ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో కూడా 48 గంటల పాటు ‘‘డ్రైడే’’ పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధనలను ఉటంకిస్తూ, పోలింగ్ ముగియడానికి ముందున్న 48 గంటల సమయంలో పోలింగ్ ప్రాంతాల పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, సారా దుకాణాలు, ఇతర దుకాణాలు లేదా మరే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ప్రదేశాలలోనూ మద్య అమ్మడం కుదరదని కమిషన్ అందులో పేర్కొంది.
అయితే.. చట్టపరమైన నిబంధనలను దృష్టిలో వుంచుకొని, పోలింగ్ కి 48 గంటల ముందు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత చట్టాల ప్రకారం ‘‘డ్రైడే’’ (మద్య నిషేధం) ప్రకటిస్తూ నోటిఫై చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకవేళ రీ పోలింగ్ వుంటే, ఆ తేదీన కూడా అందులో చేర్చుతారు.
సెక్షన్ లోని 135C కింద ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం దీనిని జారీ చేసింది,. క్లబ్బులు, స్టార్ హోటలళ్లు, రెస్టారెంట్లు, మద్యం నిల్వలు, దానికి సంబంధించిన లైసెన్సులున్న అన్ని సంస్థలకు కూడా ఈ ‘‘డ్రైడే’’ నిబంధన వర్తిస్తుంది. ఈ 48 గంటల పాటు ఇవేవీ పనిచేయవు. మద్యం అమ్మవు కూడా.ఆ రోజున ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలోనూ ఇటువంటి ఆంక్షలే అమలులో ఉంటాయి.
మరో వైపు 865 కోట్లను సీజ్ చేసిన అధికారులు
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ గట్టి చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుండి ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.865 కోట్ల విలువైన నగదు, మద్యం, బహుమతులను అధికారులు సీజ్ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కమిషన్ ఆదేశించడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి అక్రమంగా తరలిస్తున్న సొత్తుపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ గణాంకాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కంటే తమిళనాడులోనే అత్యధికంగా నగదు, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. తమిళనాడులో మొత్తం రూ.438 కోట్ల విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా రూ.178 కోట్ల విలువైన ఉచిత వస్తువులు, రూ.105 కోట్ల విలువైన విలువైన లోహాలు (బంగారం, వెండి), రూ.78 కోట్ల నగదు ఉన్నాయి. మరోవైపు బెంగాల్లోనూ రూ.427 కోట్ల సొత్తును అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ నగదు రూపంలో రూ.21 కోట్లు దొరకగా, ఏకంగా రూ. 172 కోట్ల విలువైన ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి








