ఔషధాలపై యుద్ధం దెబ్బ.. భారత్‌లో 96 శాతం పెరిగిన మందుల ధరలు!
Drug Price: మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను ప్రమాదంలో పడేశాయి. యుద్ధం ప్రారంభమైన కొత్తలో కేవలం చమురు, గ్యాస్ ధరలకే పరిమితమైన సంక్షోభం, ఇప్పుడు ప్రాణరక్షక ఔషధాల ధరలను సైతం ప్రభావితం చేస్తోంది. కొన్ని దేశాల్లో నొప్పి నివారణ మందుల ధరలు నాలుగు రెట్ల కంటే ఎక్కువ పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
జలసంధిని మూసివేయడం..
ప్రపంచవ్యాప్తంగా 20% చమురు , ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణా అయ్యే ఈ జలసంధిని మూసివేయడం ఇరాన్ మూసివేయడంతో సరఫరా గొలుసు దెబ్బతింది. ఔషధాల తయారీకి వాడే ‘పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్’ సరఫరాలు పర్షియన్ గల్ఫ్ నుంచే రావాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల ఈ ముడి పదార్థాల లభ్యత తగ్గి ధరలు పెరిగాయి.
ఇవి కూడా చదవండి
గగనతల మూసివేతలు..
అత్యంత కీలకమైన వ్యాక్సిన్లు, ఔషధాలలో 90% విమాన మార్గం ద్వారానే రవాణా అవుతాయి. గగనతల మూసివేతలు, విమానాల రద్దు , జెట్ ఇంధన సంక్షోభం కారణంగా రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
భారత్ , ఇతర దేశాలపై ప్రభావం..
భారతదేశం..
ఔషధాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న భారత్‌లో, పారాసెటమాల్ వంటి సాధారణ మందుల ధరలు 96% వరకు పెరిగాయని మందుల దుకాణదారులు నివేదిస్తున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
యూకేలో..
యూకేలోని ఫార్మసీలు ఓవర్-ది-కౌంటర్ మందులకు 20 నుండి 30 శాతం అదనంగా వసూలు చేస్తున్నాయి. కేవలం నొప్పి నివారణ మందులే కాకుండా, కండోమ్‌ల వంటి గర్భనిరోధక సాధనాల ధరలు కూడా ఇటీవలి రోజుల్లో గణనీయంగా పెరిగాయి.
గ్లోబల్ సౌత్ దేశాలు..
ఈ సంక్షోభం వల్ల ధనిక దేశాల కంటే గ్లోబల్ సౌత్ దేశాలు (ఆఫ్రికా వంటి ప్రాంతాలు) ఎక్కువగా నష్టపోతున్నాయి. వారి వద్ద సరిపడా నిల్వలు లేకపోవడం , పెరిగిన ధరలను భరించలేకపోవడమే దీనికి కారణం. అలాగే సుడాన్, యెమెన్, పాలస్తీనా వంటి మానవతా సంక్షోభంలో ఉన్న దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
ప్రస్తుతానికి మందుల కొరత కంటే, రవాణాలో జాప్యం , అధిక ధరలే ప్రధాన సమస్యగా ఉన్నాయని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆరోగ్య వ్యవస్థ పతనం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








